ఓజి లాంటి భారీ విజయానంతరం విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి 26 రిలీజ్ దృష్ట్యా మిగిలిన రోజులను పూర్తిగా వినియోగించుకునేలా దర్శకుడు హరీష్ శంకర్ ప్రత్యేక ప్రమోషన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈసారి సోషల్ మీడియాలో అభిమానులను మరింత చురుకుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని టాక్.
అయితే ఈ సినిమాపై ఓజి స్థాయి హైప్ ఇంకా కనిపించడం లేదు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ చిత్రం అంటే సహజంగానే ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా ప్రచార సామగ్రి ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో హరిహర వీరమల్లు విషయంలో ప్రమోషన్ లోపాలు కనిపించడంతో ప్రారంభ వసూళ్ల తర్వాత పెద్దగా లాభాలు రాలేదనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో ఉంది.
ఇక ఈ ప్రాజెక్ట్ విషయంలో దర్శకుడు హరీష్ శంకర్ గత చిత్రం మిస్టర్ బచ్చన్ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడం కొంత అనుమానం కలిగించినా, ఆయనకు గబ్బర్ సింగ్ వంటి బ్లాక్‌బస్టర్ క్రెడిట్ ఉండటం అభిమానుల్లో నమ్మకాన్ని కొనసాగిస్తోంది.
ముఖ్యంగా ఇది తేరి రీమేక్ కాదని, పూర్తిగా కొత్త కథతో వస్తోందనే భావన కలిగించేలా టీజర్, ట్రైలర్ రూపకల్పన చేయడం కీలకం. వ్యాపార పరంగా చూస్తే మైత్రి సంస్థ ఈ చిత్రానికి థియేట్రికల్ రైట్స్ ద్వారా సుమారు 100 నుంచి 150 కోట్ల మధ్య బిజినెస్ ఆశిస్తున్నట్టు ట్రేడ్ సమాచారం. అయితే ఈ లెక్కలు ఇంకా ఖరారు కాలేదు.
సంక్రాంతి తర్వాత బాక్సాఫీస్ నిర్జీవంగా మారిన నేపథ్యంలో, ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు ఉన్నాయని బయ్యర్లు భావిస్తున్నారు. పాజిటివ్ మౌత్ టాక్ వస్తే ఓజి స్థాయి రెవెన్యూ కూడా సాధ్యమనే అంచనాలు ఉన్నాయి. సరైన మాస్ ఎంటర్టైనర్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ కోసం తప్పకుండా థియేటర్లకు వస్తారన్న నమ్మకం నిర్మాతల్లో ఉంది.
అదనంగా కొన్ని పెద్ద సినిమాలు వాయిదా పడటం, కొన్ని ప్రాజెక్టులు రిలీజ్ రేస్ నుంచి తప్పుకోవడం వంటి అంశాలు కూడా ప్లస్‌గా మారాయి. అయితే వారం ముందు విడుదలకు సిద్ధమవుతున్న దురంధర్ 2 రివెంజ్, టాక్సిక్ వంటి చిత్రాలు పోటీగా ఉండడంతో ఇతర రాష్ట్రాల్లో కలెక్షన్లపై ప్రభావం ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.










Nice movie trailer