ఎన్ఎస్ అధికారిక యూట్యూబ్ ఛానల్లో “నన్నెట్ల మరిచావు బాపు” ఫుల్ వీడియో సాంగ్‌ను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవీంద్రభారతి రంగస్థల నటుడు, ప్రముఖ నటన శిక్షకులు శరత్ సుంకరి, డబుల్ బ్యారెల్ సినిమా దర్శకుడు ఆదిత్య, అలాగే డాక్టర్ అంతగిరి హాజరై చిత్రబృందానికి తమ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సాంగ్‌ను హరీష్ రాజ్ నేత నిర్మించగా, కథ, సాహిత్యం మరియు దర్శకత్వ బాధ్యతలను నర్రా నర్సింలు ముదిరాజ్ నిర్వహించారు. కెమెరా విభాగంలో డీజే పవన్, మోజెష్ పనిచేయగా, సినిమాటోగ్రఫీ (DOP)ని శేఖర్ ఫ్రాన్సిస్ అందించారు. ఎడిటింగ్, డీఐ మరియు పోస్టర్ డిజైనింగ్ బాధ్యతలను నరేష్ మాస్టర్ నిర్వహించారు.
ఈ ప్రాజెక్ట్‌కు సిని చిత్ర న్యూస్ మీడియా సపోర్ట్ అందించగా, సోషల్ మీడియా ప్రమోషన్‌ను బి సినీ ఈటి (Bcineet Team) మరియు స్వర్గం శరణ్య నిర్వహించారు.
ఈ మ్యూజిక్ వీడియోలో రాకేష్ గౌడ్, ఉమా మహేశ్వరి, రంగయ్య, మహేందర్, మోజెష్, బోండ్ల లక్ష్మి, దీపిక, మన్నెమ్మ, పుష్పమాల, మాస్టర్ విహాన్, బేబీ తన్విక ప్రధాన పాత్రల్లో నటించి తమ నటనతో ఆకట్టుకున్నారు.
భావోద్వేగాలతో కూడిన ఈ పాట ప్రేక్షకులను అలరించడంతో పాటు సోషల్ మీడియాలో మంచి స్పందనను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది.









