టాలీవుడ్లో ఒకప్పుడు బోల్డ్ అండ్ సెన్సేషనల్ కంటెంట్‌తో సంచలనం సృష్టించిన ‘ఆరుగురు పతివ్రతలు’ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా బుల్లితెరపై రిపీటెడ్ వ్యూయర్షిప్ లభించేంది. ఇక ఈ సినిమా సోషల్ మీడియాలో మీమర్స్ పుణ్యమా అని ఇప్పటికీ ట్రెండింగ్ అవుతూనే ఉంది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం నేటి తరం ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసేందుకు సిద్ధమవుతోంది.
‘ఆరుగురు పతివ్రతలు’ ఇప్పుడు రీ-రిలీజ్ రేసులోకి వచ్చింది. ప్రముఖ దివంగత దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ మార్క్ వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం, అప్పట్లో బాక్సాఫీస్ మంచి విజయం సాధించడమే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తుండటంతో, సరికొత్త డిజిటల్ ప్రింట్‌తో ఈ సినిమాను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
మహిళల మనోభావాలు, వారి వైవాహిక జీవితాల్లోని అంతర్గత సమస్యలను ఇ.వి.వి. తనదైన శైలిలో కాస్త బోల్డ్‌గా, మరికాస్త హ్యూమర్‌తో ఈ చిత్రంలో చూపించారు. అప్పట్లో ఈ చిత్రంపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ, యూత్‌ను మరియు కమర్షియల్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయింది. మరి నేటి తరం ప్రేక్షకులను ఈ సినిమా ఎలా ఎంటర్టైన్ చేస్తుందో వేచి చూడాలి.









