మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరోసారి తన స్టైలిష్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన షిసెడో అల్టిమ్యూన్ గ్రాండ్ ఈవెంట్లో భారత తరఫున పాల్గొన్న తమన్నా.. గ్లోబల్ స్టార్స్‌తో కలిసి మెరిసిపోయింది. ఈ వేడుకలో బ్లాక్‌పింక్ లీసా, థాయ్ స్టార్ విన్ మెటావిన్తో ఒకే వేదికను పంచుకోవడం విశేషం.

ఈ ఈవెంట్ కోసం బ్లాక్ కలర్ హాల్టర్ గౌన్‌లో తమన్నా అదిరిపోయే లుక్‌లో కనిపించింది. డీప్ నెక్, థై-హై స్లిట్తో గ్లామర్ డోస్ పెంచేసిన మిల్కీ బ్యూటీ.. గోల్డ్ పెండెంట్, స్టేట్మెంట్ ఇయర్‌రింగ్స్‌తో లుక్‌ను కంప్లీట్ చేసింది. రెడ్ లిప్‌స్టిక్, స్లీక్ హెయిర్‌స్టైల్‌తో ఆమె ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.









