ప్రముఖ దర్శకుడు అకుల సందీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన “కన్నీటి సంద్రం” పాట ప్రోమోను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సిద్దిపేటలో విశేషంగా నిర్వహించబడింది.
ఈ పాటను త్వరలో విహా ఫ్లోక్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ గీతంలో నిత్తు క్వీన్ మరియు పెర్క వినయ్ ప్రధాన పాత్రల్లో నటించగా, వీరా భాయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు గారు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తూ, యువ కళాకారులు తమ ప్రతిభతో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. నటుడు పెర్క వినయ్ మాట్లాడుతూ, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ పాటను రూపొందించామని, త్వరలో పూర్తి పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, అభిమానులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. “కన్నీటి సంద్రం” పాట ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతుందనే నమ్మకాన్ని చిత్ర బృందం వ్యక్తం చేసింది.










