యువ దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ ప్రస్తుతం తన తాజా చిత్రం “చెట్టు మీద దెయ్యం నాకేం భయం”తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన తన గత చిత్రం “నరుడి బ్రతుకు నటన” టైటిల్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని మీడియాతో పంచుకున్నారు.
ఈ విషయంపై తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ…
“సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఆ టైటిల్ కోసం నాకు లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన డబ్బులు ఇవ్వలేదు. ఇండస్ట్రీలో మంచి సంబంధాలు కొనసాగాలనే ఉద్దేశ్యంతో నేనే మిగతా డబ్బులు తీసుకోకుండా వదిలేశాను. కానీ ఇటీవల ఒక సందర్భంలో హీరో సిద్దు గారు మాట్లాడుతూ, ఆ టైటిల్ కోసం మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నామని చెప్పారు. నేను పూర్తి డబ్బులు తీసుకోలేదనే విషయం ఆయనకు తెలియకపోవచ్చు” అని స్పష్టం చేశారు.









