టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న మూవీ #RAPO23. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. రామ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం కాగా… సోషల్ మీడియాలో ఫోటోస్ ట్రెండ్ అవుతున్నాయి.

ఈ మూవీకి స్వీయ దర్శకత్వం వహిస్తూనే హీరోగా నటిస్తున్నారు రామ్. దీంతో పాటే సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. సోమవారం పూజా కార్యక్రమం తర్వాత… నిర్మాత కృష్ణ పోతినేని స్క్రిప్ట్‌ను రామ్‌కు అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి పి.మురళీ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, పి.వి.రవి కిషోర్ క్లాప్ కొట్టారు. దర్శకుడిగా తన ప్రయాణానికి శ్రీకారం చుడుతూ తొలి షాట్‌కు రామ్ పోతినేని స్వయంగా దర్శకత్వం వహించారు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా సోమవారం హైదరాబాద్ శివార్లలో ప్రారంభమైంది. హీరో రామ్ చిత్రంలోని ప్రధాన తారాగణంతో కలిసి షూటింగ్లో పాల్గొన్నారు. ఒరిజినల్ కథను స్వయంగా రామ్ రాశారు. నియో – నోయర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని విభిన్న అంశాలను, ఆసక్తికరమైన పాత్రల ప్రయాణంతో ఈ మూవీ ఉండబోతోంది.

ఆంధ్ర కింగ్ తాలూకా మూవీలో రామ్ సింగర్‌గా మారారు. ఇప్పుడు డైరెక్టర్, రైటర్‌గా తనలో మరో టాలెంట్ చూపించబోతున్నారు. మెగా ఫోన్ పట్టి కెమెరా ముందు, వెనుక బాధ్యతలు చేపట్టడం ద్వారా ఈ ప్రాజెక్టుపై ఆయనకున్న డెడికేషన్ అర్థమవుతోంది. తన కెరీర్లోనే అత్యంత సవాల్‌తో కూడిన పాత్రను ఆయన ఇందులో పోషించబోతున్నట్లు తెలిపారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై మూవీని నిర్మిస్తున్నారు. ఇతర నటీనటుల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

సినిమాలో వీర రోల్లో కనిపించనున్నారు రామ్. V కట్ హెయిర్ స్టైల్‌తో పవర్ ఫుల్ లుక్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఎమోషనల్, క్రైమ్, తిరుగుబాటు అంశాలే ప్రధానంగా స్టోరీ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అత్యున్నత స్థాయి సాంకేతిక బృందం ఈ చిత్రానికి పని చేస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత తిరునావుకరసు (తిరు) DOPగా చేస్తుండగా, ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హైన్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు.
నటీనటులు : రామ్ పోతినేని
టెక్నికల్ టీం : రచన, దర్శకత్వం – రామ్ పోతినేని, నిర్మాత – కృష్ణ పోతినేని, బ్యానర్ – రాపో సినిమాటిక్స్, DOP – తిరునావుక్కరసు, స్టంట్స్: పీటర్ హెయిన్, ప్రొడక్షన్ డిజైనర్ – AS ప్రకాష్.









