ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌ల కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో మార్చి రెండో వారంలో పలు ఓటీటీ వేదికలు ఆసక్తికర కంటెంట్‌తో సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, జియో హాట్‌స్టార్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో 20కి పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్కు రానున్నాయి. ముఖ్యంగా రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, విశ్వక్ సేన్ ‘ఫంకీ’, ‘మేడిన్ కొరియా’ వంటి చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
ప్రస్తుత తరంలో ప్రేక్షకుల అభిరుచి మారడంతో వినోద ప్రపంచంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదలవుతుండటంతో సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా థియేటర్లలో పెద్ద సినిమాలు లేని వారాల్లో ఓటీటీలు ప్రేక్షకులకు ప్రధాన వినోదంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి రెండో వారంలో కూడా పలు ఓటీటీ వేదికలు ప్రేక్షకులను అలరించేందుకు కొత్త కంటెంట్‌తో సిద్ధమయ్యాయి. ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలు లేకపోయినా, ఓటీటీలో మాత్రం 20కు పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్కు రానున్నాయి. ముఖ్యంగా రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’, ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘మేడిన్ కొరియా’ వంటి చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
ముందుగా నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో విడుదల కానున్న కంటెంట్‌పై దృష్టి పెడితే… మార్చి 10న ప్రముఖ ఇంగ్లిష్ వెబ్‌సిరీస్ ‘వన్ పీస్ సీజన్ 2’ స్ట్రీమింగ్ కానుంది. మార్చి 12న తెలుగు డబ్బింగ్‌తో ‘మేడిన్ కొరియా’ సినిమా విడుదల అవుతుంది. అదే రోజున ఇంగ్లిష్ వెబ్‌సిరీస్ ‘వర్జిన్ రివర్ సీజన్ 7’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే విశ్వక్ సేన్ నటించిన తెలుగు సినిమా ‘ఫంకీ’ కూడా మార్చి 12 నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వస్తోంది.
ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఆసక్తికర కంటెంట్ సిద్ధమైంది. యువతలో మంచి క్రేజ్ ఉన్న హిందీ వెబ్‌సిరీస్ ‘ది ఆస్పిరెంట్స్ సీజన్ 3’ మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఐఏఎస్ లక్ష్యంతో ప్రయత్నించే యువత జీవితంలో ఎదురయ్యే సవాళ్లతో రూపొందిన ఈ సిరీస్‌కు ఇప్పటికే మంచి ఆదరణ లభించింది. అదే రోజున తమిళ వెబ్‌సిరీస్ ‘లోకల్ టైమ్స్’ కూడా ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.
జియో హాట్‌స్టార్‌లో మార్చి 9న హిందీ రియాలిటీ వెబ్‌సిరీస్ ‘ద సొసైటీ సీజన్ 2’ విడుదలైంది. మార్చి 13న తెలుగు డబ్బింగ్ వెబ్‌సిరీస్ ‘రిసార్ట్’, అలాగే యానిమేషన్ చిత్రం ‘జూటోపియా 2’ విడుదల కానున్నాయి. మార్చి 15న ఇంగ్లిష్ చిత్రం ‘ద ఫ్యామిలీ మెక్‌ములెన్’ స్ట్రీమింగ్కు రానుంది.
ఇక జీ5 ప్లాట్ఫామ్లో మార్చి 13న రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా విడుదల కానుంది. అదే రోజున తమిళ చిత్రం ‘పూకీ’ కూడా స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే మార్చి 14న ‘అంధ ప్యార్ 2.0’ అనే రియాలిటీ షో కూడా ప్రేక్షకులను అలరించనుంది.
లయన్స్ గేట్ ప్లేలో తెలుగు డబ్బింగ్ చిత్రం ‘ద తాజ్ స్టోరీ’ స్ట్రీమింగ్ కానున్నాయి.
సన్ నెక్స్ట్లో మార్చి 13న తమిళ సినిమా ‘నాంగళ్’, ‘ఫ్రైడే’ .
ఇక ఎమ్ఎక్స్ ప్లేయర్లో మార్చి 11న హిందీ వెబ్‌సిరీస్ ‘సంకల్ప్’ విడుదల అవుతోంది.
ఇక బి సినీ ఈటి (Bcineet OTT) లో మార్చి 10 న ” ఓ ప్రేమ కథ ” , మార్చి 12 న ” విరాధ్య విశ్వం ” స్ట్రీమింగ్ కానున్నాయి.
మొత్తంగా చూస్తే ఈ వారం థియేటర్లలో పెద్దగా సినిమాలు లేకపోయినా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మాత్రం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యాయి.









