యువ ప్రతిభతో రూపొందిన ప్రేమ కథా చిత్రంగా “ఓ ప్రేమ కథ” త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హరి ప్రసాద్ కొన్నోజు, సిందూర తేజస్విని హీరో హీరోయిన్లుగా, డార్లింగ్ దాస్, అలేఖ్య, మహేష్ బాబు, పరమేశ్వర్ శర్మ, తోట సత్యనారాయణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ చిత్రాన్ని సందీప్ ఠాకూర్ నిర్మించగా, రాజ్ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రేమ, భావోద్వేగాలు, యువత జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్రబృందం తెలిపింది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను “Bcineet” బి సినీ ఈటి (B cine Entertainments PrivateLimited)” సంస్థ సొంతం చేసుకుంది. ఈ చిత్రం మార్చి 10, 2026 నుండి Bcineet OTT ప్లాట్‌ఫారమ్ మరియు ఛానల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
ఈ సందర్భంగా బి సినీ ఈటి సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ, “మా ప్లాట్‌ఫారమ్‌లో ఇప్పటికే 200 పైగా అన్ని భాషల సినిమాలు, 100కి పైగా షార్ట్ ఫిల్మ్స్, 20 పైగా వెబ్ సిరీస్‌లు, 3 టాక్ షోలు, 20 పైగా మైక్రో డ్రామాలు ( vertical films ) స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రేక్షకులకు నాణ్యమైన వినోదాన్ని అందించేందుకు మరిన్ని కొత్త ప్రాజెక్టులను త్వరలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాము” అని తెలిపారు.
అలాగే Bcineet సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బోయపాటి దిలీప్ కుమార్ మాట్లాడుతూ, “ప్రేక్షకులకు మంచి కంటెంట్ అందించడం మా ముఖ్య లక్ష్యం. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ మంచి కథలతో రూపొందిన సినిమాలను మా OTT ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చిత్రబృందం మరియు Bcineet సంస్థ కలిసి “ఓ ప్రేమ కథ” చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.









