టాలీవుడ్ యువ నటుడు తల్లాడ సాయి కృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “మ్యాజిక్ మూవ్ మెంట్స్” (మీరు అనుకున్నది కాదు). ప్రముఖ దర్శకుడు కె. దశరథ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మి శ్రీనివాస ఫిలిమ్స్ బ్యానర్లపై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. వెంకట్ దుగ్గిరెడ్డి సహ నిర్మాత, DOP – శివ రాథోడ్, Editing-మోహన్, SFX- వెంకట్, DI-రోహిత్.

విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం షూటింగ్ తుది దశకు చేరుకుంది.

వాసు ఇంటూరి, శ్రీ లక్ష్మి, 30 ఇయర్స్ పృథ్వీ, జబర్దస్త్ జీవన్, ఆకెళ్ల, జబర్దస్త్ అప్పారావు, వినోద్ నువ్వుల, కిషోర్ దాసు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని దర్శకుడు, హీరో తల్లాడ సాయి కృష్ణ తెలిపారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.









