
బుల్లితెర ప్రముఖ నటుడు ప్రభాకర్ వారసత్వం కూడా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. వారసుడు చంద్రహాస్ హీరోగా ఇదివరకే పరిచయం అయ్యాడు. అతను తన డిఫరెంట్ యాటిట్యూడ్ తో రకరకాల మీమ్స్ ద్వారా సోషల్ మీడియాలో ఎలా పాపులర్ అయ్యాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అన్నకు పోటీగా చెల్లెలు కూడా ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ప్రభాకర్ కూతురు కూడా తన క్యూట్ లుక్స్ తో కుర్రకారు మనసు దోచేస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

దివిజ ప్రభాకర్ ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ అందరి ఫోకస్ ని తనవైపు తిప్పుకుంటోంది. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పైన కంటెంట్ క్రియేటర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈమె ప్రస్తుతం వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. వెంకట్రామయ్య గారి తాలూకా అనే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది.

అమ్మడు రీసెంట్ గా తన డెబ్యూ మూవీ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటోంది. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె తనదైన చిరునవ్వుతో అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఈ ఈవెంట్ లో దివిజ వేసుకున్న డ్రెస్ ఇప్పుడు నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. లేత పర్పుల్ కలర్ డ్రెస్సులో అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా ముస్తాబై వచ్చింది.

ఈ ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో దివిజ ఎంతో అందంగా ఉందంటూ ఫాలోవర్స్ ప్రశంసిస్తున్నారు. గ్లామర్ షో కు మాత్రమే పరిమితం కాకుండా ఇలా పద్ధతిగా కనిపిస్తూనే యూత్ ను అట్రాక్ట్ చేయడం ఆమెకు బాగా కలిసొచ్చిన అంశం. ఇప్పటికే చెప్పాలని ఉంది అనే మ్యూజికల్ వీడియోకు స్వయంగా దర్శకత్వం వహించి తనలోని మల్టీ టాలెంట్ ను బయటపెట్టిన ఈమెకు సినిమాల పట్ల మంచి అవగాహన ఉంది.

సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ ఈ కొత్త సినిమాకు కచ్చితంగా ప్లస్ అవుతుందని ఆశిస్తోంది. జూలై 18వ తేదీన ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. ఒక స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న దివిజ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.









