బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ ది రివేంజ్’ (ధురందర్ 2) చిత్రం జోరు ఇప్పట్లో ఆగేలా లేదు. మార్చి 19న విడుదలైన ఈ సినిమా దాదాపు మూడు వారాలైనప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోంది. ఇప్పటికే రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ రూ. 2000 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. అయితే మొదటి రెండు వారాలతో పోల్చుకుంటే మూడో వారంలో ధురంధర్ 2 కలెక్షన్ల హవా తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమాకు హిందీ, తెలుగు భాషల్లో తప్పితే వేరే లాంగ్వెజెస్ లోనూ పెద్దగా కలెక్షన్లు రావడం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా థియేటర్ల సంఖ్య తగ్గింది. ఈ నేపథ్యంలో ధురంధర్ 2 సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాగా ధురంధర్ 1 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే సీక్వెల విషయంలో ఓటీటీ పార్ట్ నర్ మారినట్లు తెలుస్తోంది.

ధురంధర్ ది రివేంజ్ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లలో విడుదలైన 50 లేదా 60 రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తుంటాయి. ధురంధర్ పార్ట్ 1 విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు ‘ధురంధర్ 2’ సాధించిన రికార్డ్ స్థాయి వసూళ్ల నేపథ్యంలో ఈ సినిమా కూడా 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి రానుందని సమాచారం. అంటే మే 8 లేదా 15వ తేదీల్లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ కు రావొచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశముంది.









