ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విడుదలైన “రాకా” చిత్ర ఫస్ట్ లుక్ను వారు అభినందిస్తూ, ఆయనకు తమ మద్దతును వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు బత్తుల ప్రసాద్, జనరల్ సెక్రటరీ సురేష్ కొండేటి, ఖజాంచి భరద్వాజ, ఉపాధ్యక్షులు జనార్దన్, జాయింట్ సెక్రటరీ శ్యామ్ రావుట్లతో పాటు కార్యవర్గ సభ్యులు ధీరజ అప్పాజీ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్పందించిన అల్లు అర్జున్, అభిమానులు మరియు సభ్యుల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, త్వరలోనే అందరినీ సవివరంగా కలుసుకుంటానని పేర్కొన్నారు.







