మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి ప్రధాన పాత్రల్లో వైకుంఠ్ బోను తెరకెక్కించిన చిత్రం ‘వసుదేవసుతం’. రెయిన్బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల నిర్మించిన ఈ చిత్రం జూలై 10న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ‘ఆనందాల వేళ’ అనే లిరికల్ సాంగ్‌ను హీరో ఆది విడుదల చేశారు. పాటను వీక్షించిన ఆయన చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
కుటుంబ కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. తాజా పాటకు చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించగా, సాయి చరణ్ భాస్కరుణి, శృతిక సముద్రాల ఆలపించారు. జిజ్జు సన్నీ కెమెరామెన్‌గా వ్యవహరించిన ఈ సినిమాలో జాన్ విజయ్, మైమ్ గోపి, తులసి, రాజీవ్ కనకాల, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.









