హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో మీరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న తొలి చిత్రం ‘జోకర్’ ఘనంగా ప్రారంభమైంది. సాంప్రదాయ పూజా కార్యక్రమాల మధ్య జరిగిన ఈ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ చిత్రంలో యువ నటుడు మౌర్య సిద్ధవరం హీరోగా నటిస్తుండగా, తన్వీ ఆకాంక్ష కథానాయికగా నటిస్తున్నారు. వినోదంతో పాటు భావోద్వేగాలను మేళవించిన పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా దర్శకురాలు గీత సి. శేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
మీరా ప్రొడక్షన్స్ వ్యవస్థాపక నిర్మాత సందీప్ రామినేని (సాండీ) మాట్లాడుతూ, “మా బ్యానర్ నుంచి వస్తున్న తొలి చిత్రమే అయినప్పటికీ, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడటం లేదు. కుటుంబ ప్రేక్షకులు, యువతను ఆకట్టుకునే వినోదభరిత కథతో ‘జోకర్’ రూపొందుతోంది. హీరో మౌర్య సిద్ధవరం, హీరోయిన్ తన్వీ ఆకాంక్షల జోడీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది” అని తెలిపారు.
ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తొలి షాట్‌కు క్లాప్ కొట్టగా, అల్లు స్నేహ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యువ నిర్మాత బన్నీ వాస్ స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేసి అధికారికంగా చిత్రాన్ని ప్రారంభించారు.
చిత్రానికి సినిమాటోగ్రఫీని సురేష్ రగుతు అందించనున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుండగా, మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. వినోద ప్రధాన చిత్రాల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ‘జోకర్’ ఒక ప్రత్యేకమైన ఎంటర్టైనర్గా నిలుస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.









