నెల్లూరులోని శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో సూపర్నోవా క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న “స్టోరీస్ ఆఫ్ సింహపురి – పార్ట్ 1” చిత్రానికి పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమరావతి కృష్ణ రెడ్డి గారు కెమెరా ఆన్ చేసి చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఈ చిత్రంలో మడిగెల క్రిశాంత్ హీరోగా నటిస్తుండగా, డా. సుమేధ గడియారం, మిర్యాల రేణుక స్వాతి, శరణ్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముఖ్య పాత్రల్లో శ్రీపతి, తేజస్ విలన్లుగా కనిపించనున్నారు. అలాగే శ్రీధర్ నాని, జాషువా, గౌస్ భాషా, తరుణ్, రావూరి వెంకట్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను జై ప్రకాష్ నిర్వహిస్తున్నారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను అజిత్ అందించగా, గిరిజ మరియు సుబ్రహ్మణ్యం అసోసియేట్ డైరెక్టర్లుగా పని చేస్తున్నారు. ప్రొడక్షన్ మేనేజర్ & పీఆర్ఓగా శ్రీధర్ నాని వ్యవహరిస్తున్నారు.
త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా, జూన్ నెలలో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు అజిత్ తెలిపారు.












