బీబీ బ్రదర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న “రంగవరం” సినిమా నుంచి హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌ను Bcineet వేదికగా విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పాటను ప్రముఖ ఆస్కార్ విజేత డాక్టర్ చంద్రబోస్ శిష్యుడు అనిల్ కోవూరి రచించారు.
ఈ సందర్భంగా అనిల్ కోవూరి మాట్లాడుతూ, “రంగవరం సినిమాలో పాట రాయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. దర్శకుడు చెప్పిన సందర్భానికి తగ్గట్టు సాంగ్ రాయడం, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా సినిమాలోని మిగతా రెండు పాటలు కూడా అద్భుతంగా వచ్చాయి” అని తెలిపారు.
ఇదే సందర్భంగా ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న శ్రీనివాస్ కన్నం మాట్లాడుతూ, “నన్ను నమ్మి ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చిన దర్శకుడు గారికి, రంగవరం టీమ్‌కి నా కృతజ్ఞతలు. అలాగే మా మీడియా పార్ట్నర్ BRK న్యూస్‌కి ప్రత్యేక ధన్యవాదాలు” అని అన్నారు.
ఈ చిత్రంలో మహేష్ రాజబోయిన, దీక్షిత వర్మ హీరో, హీరోయిన్లుగా నటిస్తుండగా, భాగ్యశ్రీ, పటాస్ గ్యానేశ్వర్, రఘు ఢిల్లీ, రమణి, జ్యోతి, సాయిబాబా, కొండ అప్పారావు, కాజ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
“రంగవరం” చిత్రానికి కథ, దర్శకత్వం సూర్య ప్రకాష్ పోతుల వహించగా, సినిమాటోగ్రఫీ వంశీ మాచర్ల, ఎడిటింగ్ MBK మేకర్స్ అందిస్తున్నారు. డైలాగ్స్ మరియు కో-డైరెక్టర్‌గా రమేష్ తాల్లపల్లి, అసోసియేట్ డైరెక్టర్‌గా హరికృష్ణ ఒరివల్లి పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టార్ మీడియా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, కో-ప్రొడ్యూసర్స్‌గా శ్రీనివాస్ వడ్ల, హనుమంత్ చాకలి ఉన్నారు. ప్రొడక్షన్ విభాగంలో కాజా, రాజేష్ తదితరులు పనిచేస్తున్నారు.









