‘యాక్షన్ కింగ్’ అర్జున్ దర్శకుడిగా మారి, తన కూతురు ఐశ్వర్యా హీరోయిన్ గా తెరకెక్కించిన మూవీ ‘సీతా పయనం’.. ఈ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న విడుదలైంది. అయితే ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీకి టాక్ అంతగా పాజిటీవ్ రాకపోవడంతో కమర్షియల్‌గా ఫ్లాప్ గా నిలిచింది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ డేట్ ను లాక్ చేసుకుంది. ఈ మూవీ మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సన్ ఎన్ఎక్స్టీ లో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.
ఇక ‘సీతా పయనం’ మూవీ తెలుగుతో పాటు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాతోనే అర్జున్ కూతురు ఐశ్వర్య తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ముందు ఈ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్ ను అనుకున్నారు. అయితే పలు కారణాల వల్ల అతను తప్పుకోవడంతో ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ హీరోగా ఈ మూవీ తెరకెక్కింది.
ఇక సీతా పయనం మూవీలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజు, సత్యరాజ్, కోవై సరళ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. అలాగే ఈ సినిమాను రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై అర్జున్ సార్జా స్వీయ నిర్మాణంలో రూపొందించాడు. ఈ మూవీ యూత్ ఫుల్ లవ్ స్టోరీ అయినప్పటీ యువతను పెద్దగా అందుకోలేదనే చెప్పాలి. దాంతో బాక్సాఫీస్ వద్ద ప్లాఫ్ టాక్ తెచ్చుకుందీ మూవీ. ఇక మార్చి 20 నుంచి ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.









