శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫిల్మ్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం “చెట్టు మీద దెయ్యం నాకేం భయం”. ఈ చిత్రానికి తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తల్లాడ సాయి కృష్ణ, మాధురి, బాలు, రంజిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను చిత్ర బృందం అధికారికంగా విడుదల చేసింది. విడుదలైన ఈ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. చీకటి రాత్రి నేపథ్యంగా భయంకరమైన చెట్టు వద్ద, చేతిలో లాంతరు పట్టుకుని హీరో (తల్లాడ సాయి కృష్ణ) నిలబడి ఉండగా, వెనుక దెయ్యం మరియు భయంతో అరుస్తున్న మరో వ్యక్తి కనిపించడం ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
మన చిన్ననాటి మాటలను గుర్తు చేసేలా ఉన్న “చెట్టు మీద దెయ్యం నాకేం భయం” అనే క్యాచీ టైటిల్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్ మరియు కామెడీ మేళవింపుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను భయపెడుతూనే నవ్వించబోతోందని చిత్ర బృందం చెబుతోంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ వినోదాత్మక చిత్రంగా ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గణేష్ భారీ సమర్పిస్తున్నారు. అలాగే ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ సంగీత సంస్థ శబరి మ్యూజిక్ సొంతం చేసుకుంది.
నటీనటులు & సాంకేతిక నిపుణులు
సమర్పణ: గణేష్ భారీ
బ్యానర్: శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫిల్మ్స్
టైటిల్: చెట్టు మీద దెయ్యం నాకేం భయం
నిర్మాత: తల్లాడ శ్రీనివాస్
కో-ప్రొడ్యూసర్: అశోక్ నిమ్మల
దర్శకత్వం: తల్లాడ సాయి కృష్ణ
సంగీతం: లలిత్ కిరణ్
ఆడియో లేబుల్: శబరి మ్యూజిక్










