ఈ మధ్య కాలంలో పలు వెబ్ సిరీస్ లతో సహా పలు సినిమాలు కూడా నేరుగా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వస్తున్నా సంగతి తెలిసిందే. అలా లేటెస్ట్ గా U Narasimhulu , S Ramesh లు UNIQUEK PICTURES బ్యానర్ పై 4 గర్ల్స్ సినిమాని తెలుగు , తమిళం , హిందీ , కన్నడ , మలయాళం భాషలలో నిర్మించారు .
సమాజంలో ఒంటరిగా ఉన్న మహిళలు మరియు అమ్మాయిలపై గ్యాంగ్ రేపులు , మర్డర్స్ జరిగిన ఒక రియల్ ఇంసెడెంట్ ని బేస్ చేసుకుని అసలు నేరస్థులు ఎవరు ? వాళ్ల్లు తప్పించుకుంటే నేరస్తుల్ని చనిపోయిన అమ్మాయి అక్క అమ్మాయి స్నేహితురాళ్ళతో కలిసి ఎలా కనిపెట్టి పట్టుకుంది .ఆ కుటుంబం సమాజాన్ని ఎలా ఎదుర్కొంది ? తన చెల్లి కి జరిగిన అన్యాయానికి వాళ్లపై పగతీర్చుకుందా లేక చట్టానికి అప్పగించిందా అనే సస్పెన్స్ కథాంశంతో, ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది .
నిర్మాతలు మాట్లాడుతూ మా 4Girls సినిమా అమెజాన్ ప్రైమ్ , Bcineet , ఎయిర్టెల్ ఎక్స్ స్ట్రీమ్ , హుంగామ ప్లే , టాటా ప్లే బింగ్ , వాచో , Vewd , క్లౌడ్ వాకర్ , జీసన్ , అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ మరియు అన్ని స్మార్ట్ టీవీ డివైసెస్ , బ్రాడ్ బ్యాండ్ డివైసెస్ , స్మార్ట్ స్టిక్ డివైసెస్ లలో స్ట్రీమింగ్ అవుతుంది, అన్ని ఓటిటి లలో మంచి రెస్పాన్స్ వస్తుంది. మా సంస్థ నుండి మెసేజ్ ఓరియెంటెడ్ , క్రైమ్ , రివెంజ్ , థ్రిల్లర్ సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది . ఈ సందర్భం గా మా సినిమాని డైరెక్ట్ గా అన్ని ఓటిటి సంస్థలలో రిలీజ్ చేసిన Bcineet (B Cine Entertainments Private Limited ) సంస్థ బోయపాటి దిలీప్ కుమార్ ( Dk Boyapati ) గారికి మా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం . మా సినిమా అన్ని భాష ల ట్రైలర్స్ , వీడియో సాంగ్స్ యూట్యూబ్ లో రిలీజైన రోజు నుండి ట్రెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు.
వరల్డ్ వైడ్ రిలీజ్ : బి సినీ ఈ టి (బి సినీ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ).
నటి నటులు :
శృతిక గాఒక్కర్ , ఆకాంక్ష వర్మ , దితిప్రియ రాయ్ , సెజల్ మాండవియ , అంకుర్ , ప్రిన్స్ , హన్సి శ్రినివాస్తవ .
టెక్నీకల్ టీమ్ :
డి ఓ పి : జగదీశ్ , మ్యూజిక్ : జయసూర్య , బాక్గ్రౌండ్ స్కోర్ : ఎం .న్ .ర్ , స్టంట్స్ : డ్రాగన్ ప్రకాష్ , ప్రొడ్యూసర్స్ : యూ నరసింహులు , ఎస్ రమేష్ , డైరెక్టర్ : ఎస్ . శివ .









