Sailesh Kolanu ‘హిట్’ సిరీస్‌తో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కథల క్వాలిటీపై చర్చలు ఎలా ఉన్నా, కలెక్షన్ల పరంగా చూస్తే HIT: The First Case కంటే HIT 2, దానికంటే HIT 3 ఎక్కువ వసూళ్లు సాధించడం అతనికి స్టార్ డైరెక్టర్ ఇమేజ్ తెచ్చింది. అయితే ఈ ఫ్రాంచైజీ మధ్యలో బ్రేక్ తీసుకుని Saindhav రూపొందించినా, అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.దీంతో ‘హిట్’ లాంటి క్రైమ్ థ్రిల్లర్లే శైలేష్‌కు సూట్ అవుతాయన్న అభిప్రాయం వినిపించింది. కానీ ఆ ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ఇప్పుడు ఆయన రొమాంటిక్ జానర్లోకి అడుగుపెడుతున్నాడు. కెరీర్లో తొలిసారి పూర్తి స్థాయి ప్రేమకథను తెరకెక్కిస్తున్నాడు.ఇటీవల Championతో ప్రేక్షకులను పలకరించిన యువ హీరో Roshan Meka ఇందులో కథానాయకుడు. Kannappaలో హీరోయిన్గా కనిపించిన మలయాళ నటి Preity Mukhundhan ఈ చిత్రంలో రోషన్ సరసన నటిస్తోంది.ఫస్ట్ గ్లింప్స్ ద్వారానే మూవీ అనౌన్స్మెంట్ ఇచ్చిన టీం, ‘ఏమో ఏమో ఇది’ అనే కవితాత్మకమైన టైటిల్‌ను ఫిక్స్ చేసింది. టైటిల్‌కు తగ్గట్టే వీడియోను సాఫ్ట్, ప్లెజెంట్ టోన్‌లో మలిచారు.కాఫీ షాప్‌లో తల్లితో కూర్చొని ఈ జనరేషన్ అమ్మాయిల గురించి మాట్లాడే హీరో… తన కోసం దేవుడు ఏం ప్లాన్ చేశాడో చూద్దామంటూ డైలాగ్ చెప్పడం… ఆ వెంటనే హీరోయిన్ ఎంట్రీ… ఆమెను చూసి ఆకర్షితుడైన హీరోకు తాను కాఫీ షాప్ ఓనర్ అన్న విషయం బయటపడడం… తర్వాత వారి ప్రేమకథ ఎలా ప్రారంభమవుతుందో సినిమాకే వదిలేయడం—ఇలా గ్లింప్స్ మొత్తం ఆసక్తికరంగా సాగింది.రోషన్–ప్రీతి జంట ఫ్రెష్‌గా అనిపించగా, Hesham Abdul Wahab అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమాటోగ్రాఫర్ Vamsi Patchipulusu విజువల్స్ కూడా రొమాంటిక్ ఫీల్‌ను బాగా ఎలివేట్ చేశాయి. Sithara Entertainments బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం దసరా సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది.

February 16, 2026
0 Comment
26 Views
యాక్షన్ ట్రాక్ నుంచి లవ్ స్టోరీ వైపు మళ్లిన శైలేష్
by Cine Chitra








