కన్నడ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ ‘అంతిమ క్షణగళ్లు’ మరో ఓటీటీలోకి వచ్చేసింది. అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ కచ్చితంగా థ్రిల్ పంచే అవకాశముంది. ఈ సినిమాకు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ మంచి ఆదరణ దక్కుతోంది. ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ కు 8.3 ఐఎండీబీ రేటింగ్ ఉండటం విశేషం.
కన్నడ హారర్ మిస్టరీ థ్రిల్లర్ అంతిమ క్షణగళ్లు సినిమా ఇవాళ (మార్చి 6 మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రం ‘బిసినీఈటీ’ ఓటీటీలో శుక్రవారం రిలీజైంది. ఇది ‘బి సినీ ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’కు చెందిన ఓటీటీ ప్లాట్ ఫామ్. ప్రాంతీయ భాషల్లో కంటెంట్ ను ఇది స్ట్రీమింగ్ చేస్తోంది. ఇప్పుడు కన్నడ సినిమా అంతిమ క్షణగళ్లు సినిమా ఈ ఓటీటీలోకి వచ్చింది.
కన్నడ సినిమా అంతిమ క్షణగళ్లు మూవీ ఇప్పటికే బుక్ మై షో స్ట్రీమ్ లో ఇప్పటికే అందుబాటులో ఉంది. ఇది 2022 హిట్ మూవీ ‘వళియే’ సినిమాకు కన్నడ రీమేక్. ఇది ఫస్ట్ ఫౌండ్ ఫూటేజీ మలయాళ మూవీ. అంటే సినిమాలో క్యారెక్టర్లు తాము రికార్డ్ చేసిన వీడియో ఫుటేజ్ ద్వారా స్టోరీని చూపిస్తాయి. అంతిమ క్షణగళ్లు అంటే అంతిమ క్షణాలు అని అర్థం.
అంతిమ క్షణగళ్లు సినిమా ఇద్దరు యూట్యూబ్ వ్లాగర్స్ చుట్టూ సాగుతోంది. ఓ మిస్టీరియస్ ల్యాండ్ గురించి డాక్యుమెంటరీ చిత్రీకరించడానికి ఇద్దరు యూట్యూబ్ వ్లాగర్స్ వెళ్తారు. అక్కడ విచిత్రమైన, వింత ఘటనలు జరుగుతాయి. అక్కడున్న మిస్టరీ అదిరిపోయే ఉత్కంఠను కలిగిస్తుంది.
ఆ రహస్య ప్రాంతానికి వెళ్లిన వాళ్లకు భయానకమైన పరిస్థితులు ఎదురవుతాయి. ప్రాణాలు పోయే సంఘటనలు కళ్ల ముందే కనిపిస్తాయి. కెమెరాల్లో రికార్డ్ అయిన సీన్స్ పరంగానే అంతిమ క్షణగళ్లు మూవీ స్టోరీ ముందుకు సాగుతుంది. మరి చివరకు ఏం జరిగింది? ఆ మిస్టీరియస్ ప్లేస్ లో ఏముంది? రహస్యం ఏమిటి? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
అంతిమ క్షణగళ్లు సినిమాకు నిర్మల్ బేబీ వర్గీస్ డైరెక్టర్. ఇందులో బేబీ వర్గీస్, రోహిత్ వి.ఎస్, రజిత్ కుమార్, అస్వతి అనిల్, విష్ణు గోవిందన్ తదితరులు నటించారు.








