నేచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద ఘనమైన ఓపెనింగ్‌ను సొంతం చేసుకుంది. విడుదలకు ముందే భారీ అంచనాలను నెలకొల్పిన ఈ చిత్రం.. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.88 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రీమియర్స్‌తో కలిపి వచ్చిన ఈ వసూళ్లు నాని కెరీర్లోనే అత్యధిక ఫస్ట్ డే వరల్డ్‌వైడ్ గ్రాస్‌గా నిలిచాయి.

నాని క్రేజ్‌తో పాటు ‘ది ప్యారడైజ్’పై నెలకొన్న భారీ హైప్, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని కలయిక సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో చిత్రానికి మంచి ఓపెనింగ్ లభించగా, ఓవర్సీస్ మార్కెట్లలోనూ సినిమా బలమైన వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రం $1.55 మిలియన్‌కు పైగా వసూళ్లు సాధించగా, ఓవర్సీస్ మార్కెట్ల మొత్తంలో సుమారు $2.25 మిలియన్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. అయితే విడుదల అనంతరం సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో, రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద సినిమా ఏ స్థాయిలో నిలబడుతుందనేది ఆసక్తికరంగా మారింది.
తొలి రోజే భారీ వసూళ్లతో తన సత్తా చాటిన ‘ది ప్యారడైజ్’కు ఇప్పుడు అసలు పరీక్ష మొదలైంది. ముఖ్యంగా వీకెండ్ తర్వాత కూడా కలెక్షన్స్‌లో అదే జోరు కొనసాగుతుందా? ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుంది? అన్నది కీలకంగా మారింది.
బలమైన డే 1 ఓపెనింగ్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం.. రాబోయే రోజుల్లో అదే జోరును కొనసాగించి సక్సెస్ఫుల్ థియేట్రికల్ రన్‌ను సాధిస్తుందా అన్నది ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద చూడాలి.









