సిద్దిపేట: సిద్దిపేట మూవీ ఆర్టిస్ట్స్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ (స్మాట్) ఆధ్వర్యంలో థియేటర్ మరియు ఫిల్మ్ 24 క్రాఫ్ట్స్‌కు సంబంధించిన ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు చిరంజీవి తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుండి మే 1వ తేదీ వరకు అడ్మిషన్లు స్వీకరించబడతాయని ఆయన వెల్లడించారు. పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఆసక్తి గల అభ్యర్థులు త్వరగా నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు శివరాం రెడ్డి మాట్లాడుతూ, స్మాట్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో నిర్వహిస్తున్న ఈ వర్క్‌షాప్ గ్రామీణ కళాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుందని అభినందించారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చిరంజీవి, ఉపాధ్యక్షుడు సుమన్, ప్రధాన కార్యదర్శి నర్సింలు, ఇంచార్జి ఉపాధ్యక్షుడు స్వామి చరణ్, కోశాధికారి శ్రవణ్, ఉపకోశాధికారి హరీష్‌తో పాటు లింగమూర్తి, వినయ్, ప్రచార కార్యదర్శులు మోజెష్, నవీన, కనకలక్ష్మి, ప్రభంజన్ తదితరులు పాల్గొన్నారు.









