సిద్దిపేట మూవీ ఆర్టిస్ట్స్ అండ్ టెక్నీషియన్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో సినీ రంగానికి సంబంధించిన 24 విభాగాల్లో 30 రోజుల ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించబడుతోంది. ఈ వర్క్‌షాప్‌ను అధ్యక్షుడు చిరంజీవి, ఉపాధ్యక్షులు సుమన్, ఇన్చార్జ్ ఉపాధ్యక్షుడు స్వామి చరణ్, కోశాధికారి శ్రవణ్ కుమార్, ఉప కోశాధికారి హరీష్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ఈ నెల 26వ తేదీ ఆదివారం ఎస్ఆర్కే డిగ్రీ కాలేజ్ (మూడో అంతస్తు)లో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. సినీ రంగంలో ప్రవేశించాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
మరిన్ని వివరాల కోసం సిద్దిపేట మూవీ ఆర్టిస్ట్స్ అండ్ టెక్నీషియన్స్ యూనియన్ను 9491813344 నంబర్లో సంప్రదించవచ్చు.









