సినీనటులు రచ్చ రవి అసమాన్యుడు
నీ రుణం తీరేదెట్ల ఆవిష్కృతం.. అద్భుత యోచన శైలికి మా రచ్చ ప్రతిభా నిదర్శనం
మహిళా మణుల ఆదర్శo .నేటి సమాజానికి దిక్సూచి
సినీ నటులు రచ్చ రవి రూపొందించిన..పోస్టర్ ఆవిష్కరణ సభలో ప్రముఖ సినీనటులు, రచయిత తనికెళ్ళ భరణి..
మే 10 న మా రచ్చ రవి తన రచనలతో మరో కోణాన్ని ఆవిష్కరించబోతున్నాడని తెలుపడానికి సంతోషిస్తున్నానని, తన చేతుల మీదుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకకు చెందిన ఆకాశంలో. సగ భాగం మహిళ.. ఆ మహిళకు చెందిన క్యాప్షన్.. దృశ్య రూపంలో “నీ ఋణం తీరేది ఎట్ల” అని పోస్టర్ ను ఆవిష్కరింప చేసిన రచ్చ రుణం నేను తీర్చుకునేదెట్ల అన్న మాదిరిగా స్తితి నెలకొందని, మా రచ్చ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా జబ్బర్ధస్త్ స్కిట్ లతో తన బుల్లితెర నటనా రూపాన్ని తెలుగు ప్రజలకు అందించి నేడు సెల్యులాయిడ్ పై తన నటన విశ్వరూపాన్ని విశ్వవ్యాప్తం వలయంలో . మీ.. మా.. రచ్చగా… రచ్చ రచ్చ.. చేస్తూ…మనందరినీ నవ్వించడమే కాకుండా.. పూర్తి నిడివి ప్రధాన పాత్రల్లో 24 ఫ్రేమ్స్ లో రచ్చ ఒక ఫ్రేమ్ లో నిలిచాడు అంటే మీ అందరి అభిమానం, ఆ..విశ్వ నాధుడి ఆశీస్సులతో..మా దీవెనలతో రచ్చ ఇగ..ఆగడు… కుదురుగా కూసోడు…నటనే ప్రాణంగా భావిస్తూ…తన సినీ ప్రయాణంలో కోట్లాది ప్రేక్షక దేవుళ్ళ అభిమానంతో పాటు.సినీ కళామతల్లి దీవెనలు మెండుగా కలిగి ఉన్న రచ్చ… మరో కోణం చూడాలన్న …వినాలన్న మే 10 వరకు నిరీక్షించాల్సిందే అంటున్నడు..రచ్చ ఏది చేసిన ప్రత్యేకతకు అదే ప్రత్యేకత అయి విశిష్టమవుతుందని, ఇన్నోవేటివ్ గా చేసే ప్రతి చర్య. అద్భుత కావ్యంగా, రచనగా ప్రేక్షక దేవుళ్ళకు వరoగా మారుతుందని తాను ఆశిస్తున్నట్లు వివరించారు.
అనంతరం సిని నటులు “రచ్చ” రవి పోస్టర్ విడుదలకు కు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ నగర ప్రజల ప్రోత్సాహం తల్లి దండ్రుల ఆశీర్వాదం తో ఇప్పటివరకు బుల్లి, వెండి తెర లపై అనేక వైవిధ్య పాత్రలను పోషించే అవకాశం దక్కిందని, ఇప్పటివరకు సుమారు 150 సినిమాలలో విభిన్న పాత్ర లలో నటించే అవకాశం దక్కిందని తాను నటించిన అన్ని పాత్రలు సంతృప్తి ను కలిగించాయని, మహిళ లేనిదే సమాజం లేదని అమ్మ గా అక్క గా చెల్లిగా భార్యగా విభిన్న పాత్రలు పోషించేది కేవలం మహిళలేనని మార్చి 8 న మహిళా దినోత్సవం సందర్భం గా “నీ రుణం తీరేది ఎట్ల?” అనే పోస్టర్ ను ఆవిష్కరించుకోవడం జరిగిందని,ఇదే క్రమం లో మహిళా మణులను గౌరవించుకోవడం మన బాధ్యత అని ఇందుకోసం మే 10 న మరో ఆవిష్కరణకు సిద్ధం అవుతున్నట్లు ఈ సందర్భం గా “రచ్చ” రవి తెలిపారు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మరో జన్మ నాకు సినీ కళామతల్లే అని భావోద్వేగానికి లోనవుతూ.. మహిళమనులకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ.. “మే 10 న రచ్చ మరో కోణం కోసం ప్లీజ్ వెయిట్ అంటున్నాడు, మరి ఇంతకి ఆ సస్పెన్స్ కు తెరతీయాలంటే మనమంతా ఆగక తప్పదు మరీ.. సో మన రచ్చన్న కు ఆల్ ది బెస్ట్ చెప్పేస్తే పోలే.. ఓ రచ్చాన్నో… ఆల్ ది బెస్టన్నో...












