నిక్షయ్ శెట్టి, హారిక మెట్ట జంటగా నటిస్తున్న తాజా షార్ట్ ఫిల్మ్ ‘ఫస్ట్ కిస్’. వంశీ ప్రభ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ లఘు చిత్రాన్ని మణిదీప్ అల్లా, దినేష్ కల్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తాజాగా ఈ షార్ట్ ఫిల్మ్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నేటి యువతను ఆకట్టుకునే అంశాలతో, చక్కటి ప్రేమకథగా దీనిని రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. నిక్షయ్, హారికల మధ్య కెమిస్ట్రీ, విజువల్స్ చాలా ఫ్రెష్‌గా ఉండి ప్రేక్షకులను అలరిస్తున్నాయి.వెన్నెల.డి అందించిన కథకు, సన్నీ సంకూరు అందించిన సంగీతం, సూర్య తేజ సినిమాటోగ్రఫీ అదనపు బలాన్ని చేకూర్చాయి. త్వరలోనే ఈ షార్ట్ ఫిల్మ్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.సాంకేతిక నిపుణులు:నటీనటులు: నిక్షయ్ శెట్టి, హారిక మెట్టదర్శకత్వం: వంశీ ప్రభనిర్మాతలు: మణిదీప్ అల్లా, దినేష్ కల్లూరికథ: వెన్నెల.డిసంగీతం: సన్నీ సంకూరుడి.ఓ.పి: సూర్య తేజఎడిటర్: మనోజ్ కుమార్ బిడి.ఐ: సతీష్ పాలకవీటి

February 17, 2026
0 Comment
33 Views
ఆకట్టుకుంటున్న ‘ఫస్ట్ కిస్’ షార్ట్ ఫిల్మ్ ట్రైలర్!
by Cine Chitra








